జనం న్యూస్ నవంబర్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామి స్వయంభు దేవాలయoనకు సోమవారం నాడు అనకాపల్లి వాసి యల్లపు వరాహ వెంకట జయ రాజశేఖర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలియజేశారు. వీరు యల్లపు జయప్రకాష్ ఉమా దంపతులు కుమారుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తిశేషులు కొణతాల మనోహర నాయుడు అల్లుడు. ప్రస్తుతం రాజశేఖర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర స్టాప్ సెలక్షన్ రాష్ట్రస్థాయి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఇతను ఐఏఎస్ క్యాడర్ కి చెందిన వ్యక్తిగా ఎక్కడ పని చేసినా అందరికీ అందుబాటులో ఉంటూ మన్నలు పొందుతున్నారని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పేరూరి చిన్న స్వామి కర్రీ శివన్నారాయణ పెంటకోట సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.//


