Listen to this article

జుక్కల్ నవంబర్ 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున సోమవారం రోజు హైదరాబాద్‌లోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ భవిష్యత్ కార్యక్రమాలపై ముఖ్యమైన సూచనలు అందజేశారు. పార్టీ బలోపేతం, కేడర్‌కు ఉత్సాహం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సాగాల్సిన పార్టీ చైతన్య కార్యక్రమాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు.