సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 24
మొగుడంపల్లి మండల్ సున్నం బట్టి తండాలో త్వరలోనే ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవుతోంది. సాధన సమితి రైతు సంఘం జనరల్ సెక్రెటరీ పోము రాథోడ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ ఈ సందర్భానికి విచ్చేసి రైతు సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులను ప్రత్యేకంగా సన్మానించనున్నారు.రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సాధన సమితి కీలక నాయకుల సేవలను గుర్తిస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. స్థానిక నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు.



