

జనం న్యూస్ ఫిబ్రవరి 01(నడిగూడెం)
మండల కేంద్రానికి చెందిన కుంభజడ వెంకటమ్మ భర్త శ్రీను ను అదే గ్రామానికి చెందిన అహల్య కులం పేరుతో దూషించారని ఇచ్చిన పిర్యాదు మేరకు నడిగూడెం పోలీస్ స్టేషన్ లో 27/19 లో సెక్షన్ 324,504,506,లలో 1989 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విషయం లో శనివారం ఎస్సి, ఎస్టి కోర్టు నల్గొండ జడ్జి రోజా రమణి ఎస్సీ, ఎస్టీ యాక్ట్ సెక్షన్ ప్రకారం ముద్దాయి అహల్య కు ఆరు నెలల జైలు శిక్ష , 4000 రూపాయల జరిమాన విధించినట్లు మండల ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.