Listen to this article

జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం రైతులు పండించిన వరి ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్ముకోవద్దని ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర పొందాలని పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ అన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు మండలంలోని కాట్రపల్లి సూర్య నాయక్ తండా గోవిందపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ పొందాలన్నారు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులను తాలూ తేమ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో ఏపిఎం వేణుగోపాలరావు శాయంపేట పిఎసిఎస్ సీఈవో రాజమోహన్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి వైనాల కుమారస్వామి చిందం రవి దుబాస్ కృష్ణమూర్తి మారపెల్లి కట్టయ్య జగన్ రఘు సింగ్ లక్ష్మణరావు మొగిలి మంజుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు…