జనం న్యూస్, నవంబర్ 24,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం గ్రామంలో ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, యువజన శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ అనే అంశంపై సోమవారం నిర్వహించిన యూనిటి మార్చ్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పారిశ్రామిక కేంద్రంగా నిత్యం అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో భారత తొలి ఉప ప్రధాని,ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటెల్ 150 వ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ యూనిట్ మార్చ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.స్వతంత్ర భారత దేశంలో సంస్థలను విలీనం చేయడంలో పటేల్ ముఖ్య భూమిక పోషించారన్నారు.అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం యువతలో నైపుణ్యాలు,మానసిక, శారీరక నైపుణ్యాలను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



