బిచ్కుంద నవంబర్ 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల ప్రభుత్వం జూనియర్ కళాశాలలో బిజెపి పార్టీ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో వందేమాతరం రచించి 150వ సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా వందేమాతరాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది అనంతరం బిజెపి మండల అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ వందేమాతరాన్ని 1875 నవంబర్ 7వ తేదీ నా బంకింగ్ చంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది 2025 నవంబర్ 7 తేదీ నాటికి 150 సంవత్సరాలు వందేమాతర గేయం పూర్తిచేసుకుంది.ఈ జాతీయ గేయం యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. స్వాతంత్ర సమయంలో రచించ బడినటువంటి ఈ వందేమాతర గేయం ఎంతోమంది స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తులలో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వందేమాతర గేయంలో ఈ యొక్క భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం మరియు పుణ్య నదులు దేవి దేవతలను మునులు ఋషులు వేదాలను మరియు భారతీయ గొప్పతనాన్ని బకింగ్ చంద్ర చటర్జీ గారు ఈ యొక్క గేయ రూపంలో తెలియజేయడం జరిగింది. భారత దేశ జాతీయ గేయాన్ని పూర్తిగా విద్యార్థులు నేర్చుకుని ఈ యొక్క గేయ రచనలో ఉన్నటువంటి స్వరూపాన్ని అందరూ తెలుసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణా తార గారు.బిజెపి నాయకులు మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు రాష్ట్రస్థాయి నాయకులు పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థి విద్యార్థినులు పాల్గొనడం జరిగింది.




