

జనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన శివ(21) అనే యువకుడిపై పోక్సో, వరకట్న కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం… స్థానికంగా ఉంటున్న మైనర్ బాలికతో యువకుడు పరిచయం పెంచుకున్నాడు.
ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దలు వీరికి వివాహం జరిపించారు. ఇటీవల శివ, కుటుంబ సభ్యులు వర కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు