Listen to this article

జనం న్యూస్‌ 25 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌.

జిల్లాలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కనీస వేతనంగా రూ.26,000 పెంచాలని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాజారావు డిమాండ్‌ చేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ ముందు జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. విద్యార్హత పరిగణలోకి తీసుకొని ప్రమోషన్‌ కల్పించాలని కోరారు. హెల్త్‌ కార్డులు ఇవ్వాలని తెలియజేశారు.