Listen to this article

జనం న్యూస్‌ 25 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు జైలుశిక్ష మరియు జరిమానా విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి నవంబరు 24న శిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీఎ. ఆర్. దామోదర్ తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం పట్టణ పరిధిలో 1వ పట్టణ పోలిసుల ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి, వాహనాలు నడిపిన (1) విజయనగరం పట్టణానికి చెందినా కప్ప రెడ్డి అర్జున్, (2) విశాఖపట్నంకు చెందినా బూర్లె కనకా రావు అనే ఇద్దరు వ్యక్తులు పట్టుబడినారన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరినీ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి వారి వద్ద హాజరుపర్చగా నిందితులు ఒకరికి వారం రోజుల జైలుశిక్ష మరియు రూ.10000 లు జరిమానా, ఇంకొకకరికి 15 రోజుల జైలుశిక్ష మరియు రూ. 10,000 లు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.