Listen to this article

జనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత స్థానం కల్పించారన్నారు.
వికసిత్ భారత్‌ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్‌ ఉందని ప్రశంసించారు. మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. జాతీయ సౌభాగ్యానికి ఈ బడ్జెట్ ఓ ముందడుగు అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌కు ఈ బడ్జెట్‌ బ్లూ ప్రింట్ లాంటిదన్నారు.మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్‌ ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసించారు. ఉద్యోగ వర్గాలకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని… ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. జలజీవన్ మిషన్ పథకాన్ని పొడిగించి ఏపీకి ప్రయోజనం కల్పించిందన్నారు.