

జనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ మరియు స్వచ్చంద విరమణ చేసిన (1) ఎఆర్ డిఎస్పీ యూనివర్స్ (2) ఎఆర్ హెడ్ కానిస్టేబులు పసుపురెడ్డి జగ్గారావు జిల్లా పోలీసుశాఖ తరుపున అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత అదనవు ఎస్పీ (ఎఆర్)
జి.నాగేశ్వరరావు మరియు పోలీసు సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 1న ఘనంగా “ఆత్మీయ
వీడ్కోలు” పలికారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత మాట్లాడుతూ – పోలీసుశాఖకు మంచి సేవలను అందించి ఉద్యోగ విరమణ చేసిన ఎఆర్ డిఎస్పీ యూనివర్స్ మరియు ఎఆర్ హెచ్సి పి.జగ్గారావు శుభాకాంక్షలు
తెలిపారు. పోలీసు విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి, సామాజిక స్ఫుహ కలిగిన వ్యక్తులుగా ఇతర పోలీసు ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారన్నారు. పోలీసు ఉద్యోగంలో ప్రతీ రోజూ ఒక కొత్త
రకమైన సవాలు ఎదురవుతూనే ఉంటుందని, వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని, సవాళ్ళును అధిగమించాల్సి
ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులను వారి విధులను సక్రమంగా నిర్వహించడంలోను,
వారి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను వారి భాగస్వామ్యుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత పోలీసు ఉద్యోగులు తమ సమయాన్ని తమ ఆరోగ్యంపైనా, కుటుంబ సభ్యుతో గడిపేందుకు వెచ్చించాలని అదనపుఎస్పీ కోరారు.
ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ – ఉద్యోగ విరమణ చేస్తున్న ఎఆర్ డిఎస్పీ యూనివర్స్
ఎవరితోను మాట పడకూడదన్న మంచి ఉద్ధేశ్యంతో విధులను ఎంతో కమిట్మెంట్తో నిర్వహించారన్నారు. విధి నిర్వహణ పూర్తయిన తరువాత సమాజాన్ని జాగృత్తి పర్చాలనే ఉద్ధేశ్యంతో ప్లకార్డులతో ఓటు హక్కు, రహదారి భద్రత లేదా యువతలో సామాజిక చైతన్యంను తీసుకొని వచ్చేందుకు కృషి చేసే ఆదర్శ భావం కలిగిన వ్యక్తన్నారు. అదే
విధంగా పి.జగ్గారావు కూడా ఎంతో సౌమ్యుడని, తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో పూర్తి చేసే
వారని వారి సేవలను ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావు కొనియాడారు.
అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఎఆర్ హెచ్సీ పి.జగ్గారావు దంపతులను
జిల్లా పోలీసుశాఖ తరుపున అదనపు ఎస్పీలు పి.సౌమ్యలత, జి.నాగేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సాలువలు, పూలమాలలు, పుష్ప
గుచ్ఛాలు, గిఫ్ట్స్ ను, సన్మాన పత్రాలతో సత్కరించి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు పలికారు. అదే విధంగా జిల్లా
కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున ఇరువురికి జ్ఞాపికలను, చెట్లను అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులు వారి సర్వీసులో సహకరించిన అధికారులకు, సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు
శాఖ తరుపున ఎస్పీగారు తమకు “ఆత్మీయ వీడ్కోలు” ను పలకడం, సన్మానించడం తమ జీవితంలో ఎన్నటికీ
మరువలేమని జిల్లా ఎస్పీగార్కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు పి.సౌమ్యలత, జి.నాగేశ్వరరావు, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పీ ఎం. వీరకుమార్, ఆర్ ఐలు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె. చౌదరి, వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, టూ
టౌన్ సిఐ టి.శ్రీనివాసరావు, వుమన్ పిఎస్ సిఐ ఈ. నర్సింహమూర్తి, ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు పోలీసు
అసోసియేషను అడహక్ సభ్యులు కే.శ్రీనివాసరావు, కో-ఆఫరేటివ్ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది,పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.