Listen to this article

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ విమర్శ
జనం న్యూస్ 02 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వార్షిక మాయా బడ్జెట్ లో దేశప్రజల ఆర్థిక ప్రయోజనాల ప్రాధాన్యత కంటే కార్పొరేట్ల ఆర్థిక ప్రయోజనాలకె అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో కమలం పుష్పాలు పెట్టారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ విమర్శించారు.
శనివారం పార్లిమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అమర్ భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు కానీ, వ్యవసాయ రంగానికి ఆర్థిక సాయంలో నిబద్ధత లేదు కానీ 30 వేలు వరకు క్రెడిట్ కార్డులు అనే ప్రకటన హాస్యాస్పదం అన్నారు. పవన్ కళ్యాణ్ కి చేతిలో పదవి ఉంటే ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం నుంచి అన్యాయం జరగనివ్వరు అని కళలుగన్న ఆంధ్ర ప్రజలు కళలు చెదిరిపోయాయినట్టే అని విమర్శించారు. ఈ బడ్జెట్ చూసి చంద్రబాబు పవన్ లు సిగ్గుపడాలన్నారు. ప్రశ్నించే అవకాశం కానీ మోడీ నీ అడిగే ధైర్యం బాబు, పవన్ లకు లేదు అని అన్నారు. ఆదాయం పన్ను రాయితీలు ఇచ్చామని గొప్పలు పోతున్నారు కానీ స్లాబులు విధించి పేద, మధ్య తరగతి ప్రజల రక్తమాంసాల కోసం పన్నుల వసూళ్లలో సరికొత్త మార్పులు చేశారు దానివలన పెరిగే ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు జేబులు ఖాళీ అవ్వడం ఖాయం అని అన్నారు. ఈ బడ్జెట్ కేవలం త్వరలో జరిగబోయే ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యం మాత్రమే అని విమర్శించారు. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళుతున్నారని కనీసం ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించలేదు అని అన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు మొండి చెయ్యి చూపించారని రాజధానికి నిధులు లేవు, ప్రత్యేక హోదా ఊసే లేదు కనీసం ఆంధ్ర ఎంపీలు ఉలుకు పలుకు లేదు, పవన్ కళ్యాణ్ జూలు విదిలింపు లేదు అని విమర్శించారు. వస్తు సేవల పన్ను పెట్రోల్, డీజిల్ రేట్లు, వంట గ్యాస్ ధరలు తగ్గించలేదు దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. మరొకసారి ఈ బడ్జెట్లో కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు నిర్మలమ్మ ఫుల్ మీల్స్ పెట్టారనీ అశోక్ ఘాటైన విమర్శలు చేశారు.