Listen to this article

అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో ఐ. సి. డి. యస్ కేంద్రభవనము నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగినది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు శ్రీమతి వి. వసంతలక్ష్మి, ఎం. మనోహర్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అనేక హింసలు అనుభవిస్తున్నారని వారికి రక్షణగా అనేక చట్టాలు రూపొందించబడ్డాయని అన్నారు. గృహహింస గాని,పనిచేసే ప్రాంతంలో జరిగే హింసలు కానీ, మైనారిటీల పైన జరిగే హింస, దాడులు అన్నిటికీ రక్షణగా చట్టాలు ఉన్నాయని ఈ చట్టాలను మహిళలను అందరూ అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలని వివరించారు. సమాజంలో మహిళల పట్ల గౌరవం కలిగి ఉండటం మన బాధ్యత అని అన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో సి. డి. పి. ఓ శ్రీమతి కె ఉషారాణి, సూపర్డెంట్ ఎస్. కె. షకిలా తదితరులు పాల్గొన్నారు.
(మండల న్యాయ సేవ అధికార సంఘం వారిచే జారీ చేయబడిన పత్రికా ప్రకటన)