Listen to this article

చంద్రబాబు ఎప్పుడూ రైతుల పక్షమే

2014-19 ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రుణమాఫీ

కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు

ఇప్పుడు పంచాయతీలకు దండిగా నిధులు

కందుకూరు ప్రజలు ఆదరించి గెలిపించారు

వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా – కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు

గుడ్లూరు మండలం పూరేటిపల్లిలో రైతన్నా – మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు

చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ముందుగా రైతుల సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు.

రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా గుడ్లూరు మండలం పూరేటిపల్లి గ్రామంలో మంగళవారం సభ నిర్వహించగా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు హాజరయ్యారు.

ఇటీవల విడుదలైన అన్నదాత సుఖీభవ నిధులు, అందరి ఖాతాల్లో జమ అయ్యాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో రెండుసార్లు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు గారు నిలబెట్టుకుంటున్నారని గుర్తు చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు, ఎక్కువగా రైతులకు మేలు జరిగేలా పథకాలు తీసుకొస్తున్నారని చెప్పారు. 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వంలో వేలకోట్ల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు. గత వైసిపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తే, ఈ ప్రభుత్వంలో రైతుల కోసం ట్రాక్టర్లు, సబ్సిడీ రుణాలు, ఆధునిక యంత్రాలు, స్ప్రింక్లర్లు, డ్రోన్లు అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. అలాగే యూరియా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్న ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల్లో నిధులన్నీ దారి మళ్లించడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు విమర్శించారు. సర్పంచులు అందరూ కేవలం పవర్ లేని పాలకులుగా మిగిలిపోయారని అన్నారు. ఈ ప్రభుత్వంలో సకాలంలో 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇచ్చిందని తెలిపారు. పశుపోషణపై ఎక్కువగా ఆధారపడే పూరేటిపల్లి లాంటి గ్రామాలలో, అంటు వ్యాధులు ప్రజల కుండా పంచాయితీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఎప్పటికప్పుడు సైడ్ కాలవలు పూడికలు తీయించి, రెగ్యులర్ గా బ్లీచింగ్ చల్లాలని సూచించారు. ఈ సందర్భంగా పూరేటిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మాట్లాడారు. గ్రామం నుంచి పడమరడొంకకు వెళ్లే రోడ్డును త్వరలోనే తారు రోడ్డుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈసారి తాను గ్రామంలోకి అడుగుపెట్టక ముందే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పైపులైన్ల మరమ్మతుల పనులు పూర్తిచేసి ఇంటింటికి కొళాయి నీటిని అందిస్తామని చెప్పారు. ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో కల్వర్టు కూడా నిర్మిస్తామన్నారు. ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు చేసి ఉన్నారని, అది కూడా త్వరలో అందుబాటులోకి రాబోతుందని ఎమ్మెల్యే గారు తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఆదరించి గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు చెప్పారు.అనంతరం గ్రామస్తులు నుంచి ఎమ్మెల్యే గారు వినతి పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారం పై అధికారులకు సూచనలు చేశారు. రైతుల ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్లి, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి అంకెలతో సహా వివరించారు. ముందుగా గ్రామసభలో వెలుగు అధికారుల ద్వారా మహిళా స్వయం సహాయ సంఘాలకు మంజూరైన ఉన్నతి, స్త్రీ నిధి మరియు బ్యాంక్ లింకేజ్ పథకాల కింద ఆమోదించిన మొత్తం రూ.47 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసులు రెడ్డి, మండల ఈ. ఓ.పి.ఆర్.డి లక్ష్మీ లత, మండల వ్యవసాయ అధికారి రవి కుమార్ , మండల వెలుగు అధికారి చినబాబు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు అత్తంటి శ్రీనివాసులు, పార్టీ నాయకులు ఉమ్మనేని సుబ్బారావు, జడ యానాది, నరాల మాలకొండారెడ్డి మరియు మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..