Listen to this article

జనంన్యూస్. 02.
నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని మాదిగ సమాజాన్ని ఏకం చేయడానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
మంద కృష్ణ మాదిగ అన్న ఆదేశానుసారం ఈ కార్యక్రమం సిరికొండ మండలంలోని చిన్న వాల్గొట్.గ్రామ మాదిగ సంఘం కులస్థులతో సమావేశం ఏర్పర్చి ఎమ్మార్పీఎస్ కమిటీ వెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ మాట్లాడుతూ
ఉద్యమ చరిత్ర, మంద కృష్ణ మాదిగ అన్న నాయకత్వం గురించి, ఎంఆర్పిఎస్ మాదిగ సమాజానికి, మాదిగెతర సమాజానికి చేసిన కృషి గురించి, పోరాటాల గురించి వివరించడం జరిగింది.
అలాగే మంద కృష్ణ మాదిగ. పిలుపులో భాగంగా వేల గొంతుకలు.లక్షల డప్పులు. ఫిబ్రవరి 7 నాడు ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇంటికో మనిషి, జబ్బకో డప్పు అనే నినాదంతో హైదరాబాద్ కదలాలని పిలుపునివ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో సిరికొండ. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్
ఎమ్మార్పీఎస్ సీనియర్ జిల్లా నాయకులు నక్క రాజేందర్ మండల ఉపాధ్యక్షులు. కానాపురం సంపత్, నాయకులు చిట్యాల ఎల్లయ్య,
చిన్న వాల్గోట్ గ్రామ అధ్యక్షులు నూతపల్లి రాజు, జినుక శోభన్. జినుక రాజేశ్వర్. బొబ్బిలి రాజు తదితరులు పాల్గొన్నారు.