జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం రాజంపేట నియోజకవర్గంప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియ జేసారు.మంగళవారం నాడు నందలూరు తాసిల్దార్ కార్యాలయాన్ని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు – నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు అయన ఆకస్మికంగా తనిఖీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యలను ప్రతి దర ఖాస్తునుక్షుణ్ణంగాపరిశీలించి ,అర్జీదారుడుకి న్యాయం చేయాలని కోరుతూ,సర్టిఫికెట్లను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా మండల వ్యాప్తంగా గత వైకాపా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాలను భూకబ్జాలకు బడా నాయ కులు పాల్పడ్డారని భూ ఆక్రమణలు తొలగించి,పేదలకు పంపిణీ చేయాలని,రైతుల సమస్యలపై అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.ఈ కార్య క్రమంలోమండల పార్టీ అధ్యక్షులు జంగంశెట్టి సుబ్బయ్య, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ ఒంటిమిట్ట జడ్పిటిసిముద్దు కృష్ణారెడ్డి,సర్పంచ్ రాము,పాటూరు గ్రామఅధ్యక్షులురమేష్,సుబ్బనరసయ్య,ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.



