రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు 20 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపించారు. మంగళవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


