

జనం న్యూస్ ఫిబ్రవరి 2 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శనివారం జరిగిన సంఘటనలో భాగంగా వీధి కుక్కలు గ్రామాల్లో వీరంగం సృష్టిస్తున్నాయి మనుషులు పశువులు అని తేడా లేకుండా విరుచుకుపడి దాడి చేసి గాయపరుస్తున్నాయి. చిలిపి చెడు మండలంలోని సోమక్కపేట గ్రామంలో శనివారం నాడు వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేయగా 13 గొర్రెలు మృతిచెందాయి సోమక్కపేట గ్రామానికి చెందిన షేరి అర్జున్ గొర్రెలు మేపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఈ తరుణంలో వీధి కుక్కలు అతని జీవనంలో ప్రాణ సంకటంగా మారాయి జీవనాధారమైన గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయని రైతు బోరుణ వినిపించాడు సంబంధిత అధికారులు స్పందించి మీది కుక్కలను బంధించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు సుమారు మృతి చెందిన గొర్ల విలువ 1,70,000 వరకు ఉంటుందని అంచనా వేశారు దీంతో నష్టం వాటిల్లందని ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను కోరారు