జనం న్యూస్ 26 నవంబర్ వికారాబాద్ జిల్లా.
వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యంగా మహిళల పేరుమీద ఇందిరమ్మ ఇండ్లు, మహిళా శక్తీ బృందాల అభివృద్ధి కి అధిక ప్రాధాన్యం ఇస్తోంది అని, ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాలకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అని అన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మహిళల సంక్షేమమామే ద్వేయంగా ప్రభుత్వం సంక్షేమలు అమలు చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామెల్, అబ్రహం, సాదక్, జీవన్, యాదయ్య, మల్లేశం, బందయ్య, CC హషం, విలేజ్ సెక్రెటరీ అబ్దుల్లా, మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


