Listen to this article

జనం న్యూస్ నంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

మన సనాతన ధర్మంలో షణ్మ తాలు వున్నాయని ప్రముఖ సినీ నటుడు పుష్ప సురేష్ శర్మ తెలిపారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తన స్వగ్రామం కాట్రేనికోన లో స్వామి వారికి పూజార్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘణాపత్యం – శైవం _ వైష్ణవం – స్కాందం ఈ మతాలన్నీ ఒకే పరమేశ్వరుని బహునామాలతోబహు రూపాలతో భారతీయులంతా ఆరాధించే సంప్రదాయాలని పేర్కొన్నారు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు గాంగేయుడు శరవణభవుడు స్కందుడు షణ్ముఖుడు ఇలా అనేక పేర్లతో ఆరాధింపబడుతున్నాడని ఆయన వ్యాపార కారకుడు సంతాన కారకుడు భక్తులు కోర్కెలను తీర్చే సుబ్రహ్మణ్యుడని ఆయనని ఆరాధించే వారికి వారి వారి మనోభీష్టములు నెరవేరుతాయని శర్మ ఉద్భోదించారు మాసాలలో మార్గశిర మాసం మహోన్నతమైనదని తెలిపారు