Listen to this article

జనం న్యూస్ నవంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కాట్రేనికోనభారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప పీ ఏ సి ఎస్ వద్ద సంఘ చైర్ పర్సన్ శ్రీ నూకల వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ ( మూర్తి) డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తూ సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌబ్రతృత్వం వంటి విలువలకు పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తలను స్మరిస్తూ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగం దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాము రాజ్యాంగం కల్పించిన సౌబ్రతృత్వం పెంపొందించుకుని దేశ సేవకి అంకితం కావాలి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమం లో సంఘ సీఈఓ యర్రంశెట్టి రామచంద్రరావు , సిబ్బంది, గ్రామ ప్రజలుపాల్గొన్నారు.