Listen to this article

.జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 26

కసెట్టి జగన్ మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే విద్యార్థులకు,బిర్యానీ చికెన్ కర్రీ మరియు చాక్లెట్లు,కేకు అందించడం జరిగింది. అలాగే తర్లుపాడు నుంచి మార్కాపూర్ వెళ్లే దారిలో రహదారికి ఇరువైపులా చిలకంప పెరిగి ప్రయాణికులకు ఇబ్బంది కరంగా ఉన్నది గమనించి జెసిబి సహాయంతో కంపను తొలగించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మీకు వీలైనంతగా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజు గాని మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు గాని మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి. దానివలన పర్యావరణం పరిశుభ్రంగా ఉండడం మరియు మనందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో జగన్నాధపురం గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి అలాగే ప్రాథమిక పాఠశాల ఎస్ ఏంసి చైర్మన్ తంగిరాల అనిల్ అలాగే ఉపాధ్యాయుని అనూష పాల్గొన్నారు