Listen to this article

జనం న్యూస్. ఫిబ్రవరి 2. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)

మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ ఏ బిక్షమయ్య. పదవి విరమణ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఘనంగా పూలమాల శాలువాలతో సత్కరించి కళాశాల ప్రిన్సిపల్ కు వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురుకులాల్లో తన ఉద్యోగ జీవితాని విద్యార్థుల మధ్య ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారని తెలిపారు. బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు కూడా అతనికే దక్కడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. మంచి మనస్తత్వం ఉన్న ఇలాంటి ప్రిన్సిపల్ ని మేము మా సర్వీసులో ఎప్పుడు చూడలేమని అడ్మినిస్ట్రేషన్ ఇలా కూడా నడుపొచ్చా అనే ఆలోచనని తీసుకొచ్చిన వ్యక్తి ఏ బిక్షమయ్య అని కొనియాడారు. ఆరు నెలల వ్యవధిలోనె హత్నూర గురుకుల కళాశాల పాఠశాల ఆవరణలో తన సొంత నిధులతో చాలా మార్పులు చేర్పులు చేశారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ ఏ బిక్షమయ్య. ప్రిన్సిపల్ సార్ వచ్చాకే మా గురుకుల పాఠశాల కళాశాలలో చాలా మార్పురావడం విద్యార్థులకు అన్ని విధాల సహాయ సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. వారు పదవి విరమణ పొంది వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని విద్యార్థులు కంటతడితో వీడ్కోలు పలికారు. ఇది చూసిన ప్రిన్సిపల్ బిక్షమయ్య కంటతడి పెడుతూ మీ తోటి గడిపిన మధురమైన జ్ఞాపకాలను ఎన్నటికీ మర్చిపోలేనివని విద్యార్థులకు తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.