Listen to this article

జనం న్యూస్ 26 నవంబర్( పినపాక నియోజకవర్గం)

మణుగూరు పట్టణంలోని పి.వీ కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మణుగూరు సిఐ నాగబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి రాజ్యాంగ విలువలను తెలుసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని విభాగాలు, అనుబంధాలు, చట్టాల ప్రాముఖ్యత వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యాంగ ప్రాధాన్యతపై నిర్వహించిన వక్తృత్వ పోటీలో విజేతలైన కృష్ణ కౌశిక్, సంకీర్తన, లాస్యలకు సిఐ నాగబాబు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆరవ తరగతి విద్యార్థి అదిముల్లా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వేషధారణలో నటించి అందరి ప్రశంసలు పొందాడు.ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం. వేణు మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు కృషి చేయాలని, రాజ్యాంగ విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో శత్రు, దయానంద్, షాహిద్, సరిత, ఉపేంద్ర తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.