Listen to this article

బిచ్కుంద నవంబర్ 26 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో నేడు రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కే అశోక్ గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థుల కు అవగాహన కల్పించారు. అనంతరం రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి అశోక్ రావు విద్యార్థుల చే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు