Listen to this article

పూడ్చని గుంతతో ప్రజలకు అట్టడుగు ఇబ్బందులు

జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా

పటాన్‌చేరు పట్టణ పరిధిలో గల మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ పోల్ నిమిత్తం తవ్విన గుంటను పూడ్చకుండా వదిలేసిన ఘటన స్థానికంగా ఆగ్రహానికి దారి తీసింది. నిర్లక్ష్యంగా వదిలేసిన ఆ గుంట కారణంగా ప్రతిరోజూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు,ఆ దారి మీదుగా వెళ్లే వాహనదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద గుంట ఉండటంతో రెండు చక్రాల వాహనదారులు ప్రమాదాలు తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యాలయ ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంట పూడ్చకపోవడం ప్రజా భద్రతను పూర్తిగా పక్కనపెట్టినట్లేనని స్థానికులు మండిపడుతున్నారు. గుంటను వెంటనే పూడ్చకపోతే ప్రమాదాలు తప్పవు” అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారులు వెంటనే చర్య తీసుకొని గుంటను పూడ్చి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు