జనం న్యూస్ 27 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిల్లో రూరల్ మరియు గంట్యాడ పోలీసులు ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి, వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 10 మందిని విజయనగరం స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (ఎక్ష్సైజె కోర్ట్) శ్రీవిద్య వారి వద్ద హాజరుపర్చగా 5 మంది నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000 లు చోప్పున జరిమానా మరియు ఐదుగురు నిందితులకు 5 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.


