

జనం న్యూస్- ఫిబ్రవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో కూడా ప్రతిభ చూపిస్తూ తమ పాఠశాలకు గుర్తింపుని తెస్తున్నారు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు
జే సుప్లవి రాజ్, ఎస్.కె రిజ్వాన లు గత రెండువారాలుగా మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన నెట్ బాల్ క్రీడాకారుల క్యాంపులో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇండియన్ ఒలంపిక్స్ కి ఎంపికైనట్లుగా సెయింట్ జోసెఫ్ హైస్కూల్ హెచ్ఎం సిస్టర్ లలిత తెలిపారు, ఫిబ్రవరి ఆరో తారీకు నుంచి 15వ తారీఖు వరకు ఉత్తరాఖండ్ లో జరిగే నెట్ బాల్ 38వ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో పాల్గొంటారని తెలిపారు, నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన జె సుప్లవీ రాజ్ ,ఎస్కే రిజ్వాన లను సెయింట్ జోసెఫ్ పాఠశాల హెచ్ఎం సిస్టర్ లలిత, సిస్టర్ మతీన, సిస్టర్ క్లారా, పాఠశాల పిఈటి కిరణ్ కుమార్ మరియు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అధ్యాపక బృందం అభినందించారు,
నేషనల్ ఒలంపిక్స్ కి ఎంపికైన జె సుప్లవి రాజ్, ఎస్.కె రిజ్వాన లు మాట్లాడుతూ తాము ఇంతగా క్రీడల్లో రాణించటానికి సహకరించిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ హెచ్ఎం సిస్టర్ లలిత, సిస్టర్ క్లారాలకు ధన్యవాదాలు తెలిపారు, నెట్ బాల్ క్రీడలో ట్రైనింగ్ ఇచ్చి తాము ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పిఈటి ,నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ కిరణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.