జనంన్యూస్. 27.నిజామాబాదు
.రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో భాగంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ లను నేడు నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినోల గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నామినేషన్ స్వీకరణ కేంద్రం ను పరిశీలించి , నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకొని , పోలీస్ సిబ్బంది కి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో నవీపేట్ ఎస్సైలు తిరుపతి యాదగిరి గౌడ్ , ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీమతి కె. అనిత మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.



