చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం అనే నినాదంతో మానవ సేవే మాధవ సేవ అంటూ శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ(8341221414) కందుకూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మరియు చాపలు దాతలు సహకారంతో కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులోని స్వర్ణస్వయంకృషి మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో ఉన్న వారికి చాపలు పంపిణీ చేయటం జరిగింది.ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు గారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు చాపలు అవసరం అని సొసైటీ ద్రృష్టికి తెలపగానే సొసైటీ సభ్యుల సహకారంతో వారికి చాపలు అందజేయడం మంచి కార్యక్రమం అని అన్నారు.ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహకులు సొసైటీ సభ్యులకు,దాతలకు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు అధ్యక్షులు సేవాహృదయ డాక్టర్ రవ్వా శ్రీనివాసులు (ఎల్ ఐ సి & స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్) సభ్యులు కోట వెంకటేశ్వర్లు,మోదడుగు శ్రీనివాసరావు, రాజా శభరినాథ్ గార్లు పాల్గొన్నారు.


