జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి
ఈరోజు 27.11.2025 వ తేదీన ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామపంచాయతీ సింగరాయపాలెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త నందకిషోర్ గారు , డి రాజశేఖర్ ఏ డి ఏ గారు భీమనపల్లి-1 గ్రామంలో రైతులను కలుసుకొని ఈ కార్యక్రమం యొక్క వివరాలు తెలియజేశారు రైతులు వ్యవసాయంలో నత్ర 29 వాడకం తగ్గించి నోనాలోవా వాడుకోవాలని పంటలు కోసిన వెంటనే డి కంపోస్టు వాడటం వలన పొలంలో ఉన్న వరి దుబ్బులు తొందరగా కుళ్ళి రఫీ పంటకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం గారు మండల వ్యవసాయ అధికారి జి కుమార్ బాబు గ్రామ వ్యవసాయ సహాయకులు ఎన్ శ్రీలక్ష్మి మరియు రైతులు పాల్గొన్నారు.


