Listen to this article

జనం న్యూస్ నవంబర్ 27 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో జగిత్యాల ఐ ఎం ఏ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదాతల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా రోగులకు రక్తం కొరత తీరటం లేదని దాని కొరకు మరింతమంది రక్త దాతలు ముందుకు రావాలని డాక్టర్ గూడూరి హేమంత్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ అధ్యక్షులు పిలుపునిచ్చారు.భీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామాంలోని పద్మశాలి సంఘ్ భవన్లో ఐఎంఏ ఆధ్వర్యంలో గ్రామ యువత సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఈరోజు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి రక్తదాతలే రేపటి ప్రాణదాతలను కొనియాడారు.ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రతి మాసం చివరి వారంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని రక్త దాతలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తం కొరత తీరుటకు కృషి చేయాలని కోరారు.ఈ శిబిరంలో 34మంది తుంగూర్ గ్రామ యువకులు రక్తదానం చేశారు. రక్తదాతలందరికి ప్రశంసా పత్రాలని అందించారు.ఈ కార్యక్రమంలో ద్యావన పెళ్లి జలంధర్, వొద్దిపర్తి మధు కుమార్ ఆచార్యులు, ఆడేపు రమేష్ ,మిట్టపెల్లి శ్రీనివాస్ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.