జనం న్యూస్ నవంబర్ 27 అమలాపురం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాష ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ సభ చే ఆమోదించిన రోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా మాజీ జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ మరియు భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి విచ్చేసి డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాలతో అంజలి ఘటించి వారు మాట్లాడుతూ, స్వాతంత్రం అనంతరం ఎందరో మహానుభావుల మేదస్సుతో, భావితరాల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని భారత రాజ్యాంగం రచించడం పట్ల ఎంతో కృషి ఉందని కొనియాడారు.. ఈ కార్యక్రమానికి అమలాపురం రూరల్ మండల అధ్యక్షుడు బొంత శివాజీ, భాజపా మాజీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దాకే వెంకటరావు, అమలాపురం రూరల్ మండలం కార్యదర్శి పేరూరీ వెంకటేశ్వరరావు, బండారి సుబ్రహ్మణ్యం, రావూరి రామకృష్ణ, మాదే వెంకటేష్, కమసత్తి నాగరాజు, కూచిమంచి కృష్ణ, కూచిమంచి సంధ్యారాణి మరియు తదితరులు పాల్గొన్నారు..


