Listen to this article

జనం న్యూస్, నవంబర్ 27:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో బుధవారం రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బోనగిరి శ్రీనివాస్ ఇంటి ప్రక్కన ఉన్న రేకుల షెడ్డు క్రింద నిలిపిన ఎలక్ట్రిక్ స్కూటీ అకస్మికంగా మంటలు అంటుకుని క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది.మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే పార్క్ చేసిన మరో రెండు మోటార్ బైకులు కూడా పూర్తిగా కాలిపోయాయి. అదేవిధంగా మంటల ప్రభావంతో రేకుల షెడ్డు పాక్షికంగా దెబ్బతింది.ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రమాదంలో దాదాపు ₹1,50,000 విలువైన ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. స్కూటీకి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.ఇలాంటి ఘటనలు నివారించేందుకు ఎలక్ట్రిక్ స్కూటీ యజమానులు వాహనాలను రాత్రివేళ సురక్షిత ప్రదేశాలలో నిలపాలని, ఛార్జింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.