Listen to this article

జనం న్యూస్. జనవరి 10. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ జాతీయ స్థాయి విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో వి ఎన్ సిసిసి-2025 పడవ పోటీలు రెండవ రోజు అట్టహాసంగా ముగుసాయని కళాశాల డైరెక్టర్ డా.లక్ష్మి ప్రసాద్, కాలేజీ ప్రిన్సిపాల్ డా.సంజయ్ దూబే తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిదిగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఆర్ రవిచంద్రన్ రాజగోపాల్ హాజరై వారు మాట్లాడుతూ టెక్నాలజీకి అనుగుణంగా సస్టైనబుల్ నిర్మాణ సామగ్రి ఆచరణల ప్రాముఖ్యతపై దృష్టి సారించి ఇంజినీర్లు సమకాలీన సవాళ్లను ఎదుర్కోవడానికి సృజనాత్మకంగా ఆలోచించాలని సూచించారు.పడవల ఇంజినీరింగ్ డిజైనింగ్ లో పాల్గొనే విద్యారులతో వాటి నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్, డా.లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ డా.సంజయ్ దూబే, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ డా. ఎస్ .కృష్ణ రావు. డాక్టర్ మల్లికార్జున్. డీజీఎం.కాంతారావు. మేనేజర్ బాపిరాజు, అశోక్ రెడ్డి , సురేష్ . వివిధ విభాగాల హెచ్ఓడీలు.విద్యార్థులు తదితరు పాల్గొన్నారు