

జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.