

జనం న్యూస్ ఫిబ్రవరి 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
చెయ్యరు తెలుగుదేశం నాయకులు, త్పవటపల్లి నాగు
జనరంజకమైన బడ్జెట్తో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అభిమానాన్ని గెలుచుకుందని చెమ్యేరుటిడిపి సీనియర్ నాయకులు త్పవటపల్లి నాగు అన్నారు. గత ఏ ప్రభుత్వం చేయలేని ఎన్నో ప్రజాప్రయోజనమైన అంశాలను మేళవిస్తూ తయారుచేసిన కేంద్ర బడ్జెట్ ఉద్యోగ వ్యాపార సామాన్య ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు వేతన జీవులకు అత్యంత ఊరటనిచ్చే అంశం అన్నారు. వైద్యరంగంలో 70 వేలకు పైగా మెడికల్ సీట్లను పెంచుతూ అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైనదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హైస్కూల్ ల అభివృద్ధి లక్ష్యంగా కూడా బడ్జెట్లో నిధులు కేటాయింపు పై హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.