

జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం మండలం ముడిదాంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై రూరల్ ఎస్‌ఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మెరకముడిదాం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన కన్నూరు ఆదినారాయణ తాపీ పని చేసేందుకు శనివారం ముడిదాం వెళ్లగా పరంజీపై ఉన్న ఇనుప చువ్వ తొలగించే నేపథ్యంలో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో మొదటి అంతస్తు నుంచి కిందపడి చనిపోయాడు.