Listen to this article
  • విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్
    జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
    ఎం.ఎల్.సి. ఎన్నికల కోడ్ ను ఆండ్ర ఎస్సై ఉల్లంగించినట్లుగా వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 2న ఒక ప్రకటనలో తెలిపారు.
    ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొంతమంది రాజకీయ నాయకులను ఆండ్ర ఎస్సై కే.సీతారాములు కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ డి.భవ్య రెడ్డిని విచారణ చేసి, నివేదిక పంపాలని ఆదేశించామన్నారు.విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లుగా వచ్చిన ఆరోపణలు నిర్ధారణ అయితే నిబంధనలు మేరకు ఎస్సై పై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.