

జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజీలో ఓ విద్యార్థినిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సారవకోటకు చెందిన జగదీశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ‘విజయనగరం(D) సంతకవిటికి చెందిన యువతి డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటోంది.గతంలో జగదీశ్‌తో ఆమెకు పరిచయం ఉంది. గతనెల 30న ఆమెను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరాడు.అందుకు ఆమె నిరాకరించడంతో అతను దాడి చేసి గాయపరిచాడు’ అని ఎస్పీ చెప్పారు.