జనం న్యూస్ నవంబర్ 30
శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట మండలంలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎస్ వీ కే కే పంక్షన్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులకు పలు సూచనలు తెలిపారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని, వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైనా ఆర్థికంగా బలహీనంగా ఉంటే, ఆ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు ఆ అభ్యర్థి విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను, నాయకులను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకుని గెలిపించుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పత్తిపక మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి పెద్ద కోడ పాక మాజీ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ మాజీ ఎంపీపీ బసాని చంద్ర ప్రకాష్ చల్ల చక్రపాణి పొలపెల్లి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాసి కృష్ణమూర్తి చిందం రవి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..


