జనం న్యూస్ 01 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్మహాకవి గురజాడ 150 వ జయంతోత్సవాల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?గురజాడ గృహం అభివృద్ధికి, గురజాడ కళాక్షేత్రం నిర్మాణానికి కేటాయించిన నిధులు ఏమయ్యాయి..?గురజాడ జయంతులకి, వర్ధంతులకి మాత్రమే పాలకులకు ఆ మహనీయుడు గుర్తొస్తారా…?ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి (సిపిఐ అనుబంధం) ఆధ్వర్యంలో గురజాడ 110 వ వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్.మహాకవి గురజాడ జయంతులకి, వర్ధంతులకి మాత్రమే పాలకులకు ఆ మహనీయుడు గుర్తొస్తారా, విగ్రహాలకి పూలదండలు వేసి ఫోటోలు దిగి పోవడంతో భాద్యత తిరిపోయినట్టేనా, ఇదేనా ఆ మహనీయునికి పాలకులు, అధికారులు ఇచ్చే గౌరవం అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి విజయనగరం జిల్లా నిర్మాణ బాధ్యులు బుగత అశోక్ ప్రశ్నించారు.ప్రముఖ తెలుగు రచయిత గురజాడ 110 వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యాలయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తామాడ రాము అధ్యక్షతన జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఏఐటీయుసి జిల్లా అధ్యక్ష ఎస్.రంగరాజు, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఎ.ఐ.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షులు బూర వాసు, బి.సి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ముడిలి నాగభూషణం (భూషణం మాష్టారు) లు హాజరై గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, దిద్దుబాటు ఇలా అనేక రచనలు చేశారన్నారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని తన రచనల ద్వారా మహాద్భుతంగా రాసిన వ్యక్తి అన్నారు. గురజాడ గృహాన్ని అభివృద్ధి చేస్తామని, గురజాడ ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 150 వ జయంతి వేడుకల్లో ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదు అని గుర్తు చేశారు. మహాకవి గురజాడ 150 వ జయంతోత్సవాల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ధ్వజమెత్తారు. గురజాడ గృహం అభివృద్ధికి, గురజాడ కళాక్షేత్రం నిర్మాణానికి కేటాయించిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా ఇచ్చిన వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అప్పరుబోతు జగన్నాధం, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పి. గౌరీ శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. సుమన్, జిల్లా సమితి సభ్యులు అలజంగి చరణ్ తదితరులు పాల్గొన్నారు.


