Listen to this article

జనం న్యూస్‌ 01 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ

పట్నాయక్‌రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నెల్లూరు డి.వై.ఎఫ్‌.ఐ నగర్ యువనాయకుడు పెంచలయ్యను హతమార్చిన గంజాయి ముఠా వాళ్ళును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. అని ఎస్.ఎఫ్.ఐ. – డి.వై.ఎఫ్‌.ఐ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.భారతవిద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ( డివైఎఫ్ఐ) గంజాయి మాఫియా చేతిలో హత్య గావించబడిన యువజన, ప్రజా కళాకారుడు పెంచలయ్య మృతికి కారకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాని ఉద్దేశించి డి.వై.ఎఫ్‌.ఐ జిల్లా కన్వీనర సీ హెచ్.హరీష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా లో డి.వై.ఎఫ్‌.ఐ నాయకుడిని హతమార్చిన గంజాయి ముఠా ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి పెంచలయ్య తాను నివాసం ఉండే ప్రాంతంలో యువకులను మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తూ గంజాయి విక్రయిస్తున్న ముఠాను అడ్డుకునేందుకు వారిపై పోలీసులకు పిర్యాదు చేసి ఆ ప్రాంతంలో యువకులకు గంజాయి అందకుండా మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా గంజాయి ముఠా పై పోరాటం చేశాడని వారు తెలిపారు. దీనిని మనసులో పెట్టుకొని కక్షపూరితంగా గంజాయి ముఠా ఓర్వలేనితనంతో ఎలా అయినా సరే పెంచలయ్యను హతమార్చాలని కక్ష్యతో దారిలో కాపు కాచి హతమార్చడం పెంచలైన హతమార్చిన కారకలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మాట్లాడారు.. ఎస్.ఎఫ్.ఐ. జిల్లా కార్యదర్శి టd. రాము మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ముఠా అరాచకాలు ఎక్కువయ్యాయి అన్నారు. వీటిని అరికట్టడంలో పాలకవర్గం పూర్తిగా విఫలం చెందిందన్నారు. గంజాయి ముఠా ఏ స్థాయికి వెళ్లిందంటే నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడులకు తెగబడే స్థాయికి గంజాయి బ్యాచ్ వెళ్లిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. డ్రగ్స్ గంజాయి పైన ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ పోరాటం కొనసాగుతుందని దాడులకు భయపడేది లేదని భవిష్యత్తులో వీటిపైన మరింత తీవ్రస్థాయిలో పోరాటాలు సాగిస్తామని డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతంగా ముందుకు సాగుతామని నెల్లూరులో డివైఎఫ్ఐ నాయకులు పెంచలయ్య ను హతమార్చిన గంజాయి ముఠాను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, సోమేశ్, వంశీ, జయ, సిరి, జగదీష్, డివైఎఫ్ఐ నాయకులు మురళి, గోపి, పాల్గొన్నారు.