జనం న్యూస్ 01 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపండని ప్రజలకు సవాల్ చేసిన గొప్ప నేత కేసీఆర్.దీక్ష దివస్ కార్యక్రమానికి హాజరైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్ గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి. బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ గద్వాల నియోజకవర్గం:- ఈరోజు గద్వాల పట్టణంలోని *జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో* నిర్వహించిన *దీక్ష దివస్* కార్యక్రమానికి *అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు,డా.ఆంజనేయులు గౌడ్, బిఎస్.కేశవ్ తో కలిసి,బాసు హనుమంతు నాయుడు హాజరయ్యారు…* అంతక ముందు,_పార్టీ కార్యాలయ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి,తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి,నివాళులర్పించారు…_ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన దీక్ష నవంబర్ 29 రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేశారు.ఉద్యమ నేతగా కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయంతోనే రాష్ట్రం సాకారమైందని వెల్లడించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పుట్టిందే బీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. ఉద్యమ సమయంలో అనేక బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశామని గుర్తు చేశారు.ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 14ఎఫ్‌కి వ్యతిరేకంగా ఉద్యోగులు పోరాటం చేస్తుంటే కేసీఆర్ పిలుపించుకొని మద్దతు తెలిపారన్నారు.14ఎఫ్ రద్దు కోసం సిద్దిపేట సభలో ఏర్పాటు చేస్తే అక్కడే ఆమరణదీక్ష చేస్తామని కేసీఆర్ ప్రకటన చేశారన్నారు.తెలంగాణ ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమణ చేయనని కేసీఆర్ చెప్పగా..ప్రకటన వచ్చిన తర్వాత దీక్ష విరమణ చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం మరుపురాని ఘట్టం అని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో రూ.50 పింఛన్, కరెంట్ లేక రైతుల ఆత్మహత్యలు ఉండేవని,రాష్ట్రం సాధన అనంతరం కేసీఆర్ సారథ్యంలో కరెంట్,పంట సాగు,మంచి నీళ్లు,రెండువేల పింఛన్ ప్రజలకు అందించి పదేండ్లల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది సాధించిందనన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపండని ప్రజలకు సవాల్ చేసిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, పదేండ్ల పాలనలో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు.భవిష్యత్‌లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట్రాములు,మాజీ జడ్పీటీసీలు బాసు శ్యామల హనుమంతు నాయుడు,పద్మ వెంకటేశ్వర రెడ్డి,అంగడి బసవరాజ్,మోనేష్,రాజారెడ్డి,యూసఫ్,రంగారెడ్డి,పటేల్ జనార్దన్ రెడ్డి,ఆర్.కిషోర్,కురవ పల్లయ్య ప్రేమలత,రవి ప్రకాష్ గౌడ్,వెంకటేష్ నాయుడు,శ్రీరాములు,రామకృష్ణ,మల్లికార్జున్,రజిని.బాబు,అవనిశ్రీ,నాగరాజు,వెంకటేష్,నరసింహులు,రాజేష్,గోవిందు,మరియు వివిధ గ్రామాల పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….


