Listen to this article

జనం న్యూస్ 01 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల జిల్లా వివిధ ప్రాంతాల్లో నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి ఓటర్లకు డబ్బు,మద్యం, మాంసం పంపిణీ జరగకుండ, మద్యం పూర్తిగా ఎలక్షన్లు అయిపోయే వరకు బంద్ చేయాలి జిల్లా కలెక్టర్ సంతోష్ కి వినతిపత్రం అందజేత. భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎదుల నాగరాజు. జోగులంబ గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవులను వేలం పాట పాడి డబ్బుతో కొనుగోలు చేసి ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని , ప్రజా స్వామ్యాన్ని ఎన్నికలను ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నామినేషన్ వేసే యువతను బెదిరింపులకు పాల్పడే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలనీ ఈరోజు గద్వాల జిల్లా కలెక్టర్ బీ,ఎం సంతోష్ కీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జ్ మాచర్ల ప్రకాష్ గారు మరియు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షులు ఏదుల నాగరాజు కలిసి వినతిపత్రం అందజేశారు గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా ప్రజాస్వామ్య బద్దంగా జరిగే విధంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని గ్రామాలలో డబ్బు మద్యం పంపిణీ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఓటర్లకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ కాకుండా చూడాలని అదేవిధంగా ఎన్నికలు పూర్తి అయ్యేవరకు మద్యాన్ని బందు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య, యేసు, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు