జనం న్యూస్ 01 డిసెంబర్( అశ్వాపురం ప్రతినిధి:)
భద్రాద్రి కొత్తగూడెం అశ్వా పురం మండలం నెల్లిపాక బంజర విలేజ్ సర్పంచ్ అభ్యర్థిగా గొర్రె ముచ్చు అరుణ్ తేజ, నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సందర్భంగా1.గతంలో జరిగినటువంటి, ఎన్నికలలో నెల్లిపాక బంజరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకున్నట్లయితే 25 లక్షలు రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పి నమ్మించి మాయ మాటలు చెప్పి పోటీ చేసే అభ్యర్థులను నిరాశన చేశారు? 2.పేద ప్రజలకు, ఇండ్ల స్థలాల గురించి టేకుల గుట్ట గ్రామంలో గ్రామ కంఠం ల్యాండ్ ను చెత్తాచెదారాలతో ఉన్నప్పటికీ అట్టి విషయములో ప్రతి ఒక్క పేదవాళ్లు మనిషికి 2000, రూపాయల చొప్పున వేసుకొని ఆ యొక్క భూమిని చెత్తా చెదారం నుంచి తొలగించి, గ్రామస్తులు ఇండ్ల స్థలాల కై ముగ్గు పోసుకుంటే ఆపింది గ్రామ పెద్దలు కాదా?3. ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లయితే గ్రామములో కోతులను పట్టిస్తానని హామీలు ఇవ్వలేదా ?4. ఇండ్ల స్థలాల గురించి జెసి గౌతమ్ ఇచ్చిన లెటర్ ను క్యాన్సిల్ చేపించి గ్రామ పెద్దలు మీరు కాదా? గ్రామ, మధ్యలోనే డంపింగ్ యార్డ్ కట్టించిన తెలివితేటలు మీ కావా?5. 15 సంవత్సరాలుగా నెల్లిపాక బంజరు పంచాయతీలో బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది అది మీకు తెలియ15 సంవత్సరాలుగా నెల్లిపాక బంజరు పంచాయతీలో బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది అది మీకు తెలియదా?6. ఏరోజైనా గ్రామాలలో బ్లీచింగ్ జల్లించిన రోజులైనా ఏమన్నా ఉన్నాయా?7. నెల్లిపాక బంజర స్కూలు ప్రహరీ గోడ కూలిపోయి పది సంవత్సరాల కావస్తున్న ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు? 25. 11. 2025 నాడు పాయ వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు కానీ అది ఎప్పుడు పూర్తవుతుంది దాని గురించి అడిగే రాజకీయ నాయకుడు నెల్లిపాక బంజరు గ్రామంలో ఉన్నాడా లేడా? ఉంటే ఏ పార్టీలో ఉన్నాడు?8. గతంలో నెల్లిపాక కొల్లులో జరిగినటువంటి మట్టి దందా? అడిగిన నాధుడు ఎవరు? అసలు ఉన్నాడా లేడా ? అప్పుడు గ్రామ పెద్దలు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకున్నారా లేక తెలిసే చేశారా?9. మీ యొక్క అమూల్యమైన ఓటు కాలపరిమితి ఐదు సంవత్సరాలు మన గ్రామ అభివృద్ధి సద్వినియోగం అయిపోతది దయచేసి మీరు వేసే అభ్యర్థిని గురించి ఒక క్షణం ఆలోచించండి ఇప్పటికే నెల్లిపాక బంజర గ్రామం బ్రిటిష్ పరిపాలన పరిపాలించినట్టు 15 సంవత్సరాలు కావొస్తుంది ఇటువంటి మార్పు లేక ఇకనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


