

జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి, మాధవరం నగర్ కాలనీ లో యోగా మాస్టర్స్ విజయ్ కుమార్, మురళి కృష్ణ, నర్సింహా రావు, తేజు, ఎల్లప్ప, శ్రావణ్ ల ఆధ్వర్యంలో నడుస్తున్న పది హేను బ్రాంచ్ ల యోగా క్లాసులు లొ ఒకటైన టువంటి ఎన్ ఎస్ కే యోగా బ్రాంచ్ లొ ఫిబ్రవరి రెండోవ తేదీ ఆదివారం మొదటి సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినాయి. ఇందులో అగ్ని హోమం సుమారు పది మంది వేద పండితుల సమక్షంలో వేద మంత్రాలతో జరిగాయి, ఇందులో యోగా గురువు లను ఘనంగా సత్కరించి, షిల్డ్స్ అందజేశారు, అదే విధంగా యోగా సాధకులకు కూడా గురువులు షిల్డ్స్ బహుకరించడం జరిగింది, ఈ వేడుకల పట్ల ఎన్ ఎస్ కే అపార్ట్మెంట్ సభ్యులు యోగాను నిర్వహిస్తున్న గురువులను మరియు అందులో పాల్గొంటున్న సభ్యులను అభినందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు, తదుపరి అందరికీ అల్పా హారం విందును ఏర్పాటు చేశారు.