Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్

బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం నియోజవర్గంఐ.పోలవరం మండలం జి.వేమవరం, గుత్తెనదీవి గ్రామాలలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గ పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ—“ఎన్టీఆర్ భరోసా పథకం ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం కాదు… ప్రజల పట్ల ఉన్న బాధ్యత.సమయానికి, ఇంటి దగ్గరికి పెన్షన్ అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.ప్రజల జీవనం మరింత సులభం కావడం మా అసలు లక్ష్యం.” అని తెలిపారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామం – ప్రతి వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.