Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 1 నియోజకవర్గం,

జహీరాబాద్ మండల పరిధిలో ఇటుక దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నడిచాల్సిన ఈ దందాలు బహిరంగంగా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కళ్లుమూసుకుని చూడడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ బలంగా సాగుతున్న ఈ అక్రమ ఇటుక మాఫియాకు రాజకీయ పెద్దల ఆశీర్వాదం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.పెద్ద ఎత్తున భూములు తవ్విపాలు చేయడం, భూగర్భ జలాల శాతం తగ్గిపోవడం, పర్యావరణ నాశనం తీవ్రంగా పెరుగుతున్నా చూసే వారు ఎవరూ లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతుల్లేకుండా నడుస్తున్న ఈ దందాలపై సరైన చర్యలు లేకపోవడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు.ప్రజల డిమాండ్:ఇటుక భట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా నడుపుతున్న ఇటుక తయారీ యూనిట్లను వెంటనే మూసివేయాలని, ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్న అధికారులపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.